కూతురు(రాహా) పుట్టిన తర్వాత జీవితం చాలా మారిందని స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అలియా తన కూతురు కోసం నెలకో ఈమెయిల్ రాసి దాచిపెడుతున్నాని చెప్పారు. ఆ నెలలో రాహా చేసిన అల్లరి పనులు, ఫొటోలు, చిన్న కొటేషన్లను ఆ మెయిల్లో జోడిస్తున్నాని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చాక వాటిని సర్ప్రైజ్గా రాహాకు బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.