E.G: స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం కింద తూ.గో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు సాధించడంలో ‘టీం తూర్పుగోదావరి’ జిల్లా ప్రజా ప్రతినిధుల, అధికారుల, సిబ్బంది, ప్రజల కృషికి నిదర్శనం అన్నారు.