‘కాంతార చాప్టర్-1’ మూవీపై స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ పోస్ట్ చేశారు. ‘కాంతార చాప్టర్-1 ఓ అద్భుతమైన మాస్టర్ పీస్. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి మూవీని ఎన్నడూ చూసి ఉండరు. ఇది కేవలం సినిమా కాదు, ఓ సినిమాటిక్ తుఫాను. రిషబ్ శెట్టి ఒంటిచేత్తో సినిమాను నిలబెట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది’ అని కితాబిచ్చారు.