బ్రిటన్లో జరిగిన ఉగ్రదాడిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అక్టోబర్-2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున ఈ హేయమైన చర్య జరగడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదమనే దుష్టశక్తుల నుండి ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది మరోసారి తీవ్రమైన ఘటన అని పేర్కొంది. ఈ ఉగ్రవాదాన్ని ఓడించడానికి ప్రపంచమంతా ఏకంకావాలని పిలుపునిచ్చింది.