PLD: మాచవరం మండలోని వేమవరం నుంచి చెన్నైపాలెం వెళ్లే రహదారిలో శుక్రవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మనిషి ఆకారంలో ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. భయంకరంగా మనిషి రూపంతో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేశారు. ఈ దృశ్యాలను చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.