BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని మానేరువాగులో ఇవాళ గిద్ద ముత్తారం గ్రామానికి చెందిన అజ్మీర రాజేందర్ (40) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కల్లికోట నుంచి ఓడేడు వెళ్తూ వాగు దాటుతుండగా నీటిలో మునిగిపోయినట్లు తెలిసింది. అతడితో ఉన్న పంచిక తిరుపతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై సుధాకర్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.