BHPL: చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సౌజన్యంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర హాజరై, భూమి పూజ చేశారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని, ఈ పంట నిరంతర దిగుబడి ఇస్తుందని పేర్కొన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్యాక్టరీ పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.