BDK: అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ప్రభుత్వాన్ని విమర్శించారు. అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు.