MNCL: తాండూర్ మండలం మాదారం రాజీవ్ నగర్లో శుక్రవారం ఉదయం కొండచిలువ సంచరించడంతో కాలనీవాసులు ఆందోళన చెందారు. అటుగా వెళ్తున్న యువకులు దానిని గమనించి చంపివేశారు. ఇళ్ల సమీపంలో విషజీవులు సంచరిస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి, విషజీవుల బెడదను నివారించాలని కోరారు.