SRPT: తుంగతుర్తి మండలం లోని వెంపటి గ్రామానికి చెందిన కొండా వెంకన్న పుల్లమ్మ నివాసం నిన్న సాయంత్రం వర్షానికి మట్టి గోడ కూలిపోయింది. ఇంట్లో వారు లేకపోవడంతో ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ ఆఫీసర్ స్పందించి ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.