ఢిల్లీలోని JNUలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ABVP ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుండగా వామపక్ష సంఘాలు దాడి చేసినట్లు ABVP ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను ఖండించిన వామపక్ష సంఘాలు.. JNU మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ రావణుడిగా చిత్రీకరించారని, ఇలా చేసి మతపరంగా లబ్ధిపొందాలని ABVP చూస్తోందని ఆరోపించాయి.