NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా బోధన్ నియోజకవర్గంలో రైతులు వరుసగా రెండుసార్లు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంటలు పూర్తిగా మునిగిపోవడానికి మానవ తప్పిదమేనని, ముఖ్యంగా ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానిక రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ దుస్థితికి కారణమైన నిర్లక్ష్య ఎస్సారెస్పీ అధికారులపై చర్యలు తీసుకోవలన్నారు.