NLG: చండూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో గురువారం రాత్రి అమ్మవారి చీరల వేలంపాట ఘనంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన పేరాల రాజేష్ కుమార్-రాణి దంపతులు చీరలు రూ. 9వేలకు దక్కించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.