CTR: మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కృపా లక్ష్మి శుక్రవారం వెదురుకుప్పంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోషులు ఎంతటివారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమన్నారు. దోషులు ఎవరో వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.