కరీంనగర్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. జాగృతి మొదలుపెట్టిన నాటి నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్‌ను కవిత ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి మరింత కృషి చేస్తానని హరిప్రసాద్ అన్నారు.