TPT: తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో శుక్రవారం జరిగింది. ప్రస్తుతం 3నెలల ముందు ఆన్లైన్లో దర్శన టికెట్ల విడుదల చేస్తుండగా ఈ విధానాన్ని మార్చాలని పలువురు భక్తులు కోరారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. 3నెలల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లో మార్పులకు ప్రయత్నిస్తామన్నారు. నెల రోజుల ముందే టికెట్లు విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.