SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు బూర్జ మండలంలో పలు ముంపు గ్రామాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి గురువారం రాత్రి సందర్శించి, లోతట్టు గ్రామాలను ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డివో సాయి ప్రత్యూషతో పాటు అధికారులు పాల్గొన్నారు.