TG: HYD బేగంబజార్ కనిష్కస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. దసరా పండగ నేపథ్యంలో నిర్వాహకులు షాపును మూసి వేయడంతో ప్రమాదం తప్పింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో.. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజిన్లతో మంటలార్పారు. షాపులోని బంగారం, సామగ్రి కాలిపోవడంతో భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.