ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఏకంగా 103 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. అధికారుల సమక్షంలో ఆయుధాలు విడిచిపెట్టినవారిలో 23 మంది మహిళలూ ఉండగా.. వీరిలో 49 మందిపై మొత్తం రూ. కోటీ 6 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు పునరావస పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.