»Rs 9900 Crores In The Bank Account Of A Common Man In Uttar Pradesh Officials Surprised
Viral News: సామాన్యుడి బ్యాంక్ ఖాతాలో రూ.9,900 కోట్లు.. అవాక్కైన అధికారులు
ఓ సామాన్యుడి బ్యాంక్ ఖాతాలో వేల కోట్లు దర్శనివ్వడంతో అతను షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు షాక్ అవడం ఆఫీసర్ల వంతు అయింది. పూర్తి విషయం ఏంటో తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Rs. 9,900 crores in the bank account of a common man in Uttar Pradesh.. Officials surprised
Viral News: ఓ సామాన్యుడి బ్యాంక్ ఖాతాలో సుమారు రూ.9,900 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే భాను ప్రకాశ్ అనే వ్యక్తికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఎన్పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. అలాంటి అకౌంట్లో ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 కనిపించాయి. మెస్సెజ్ చూసిన భాను ప్రకాశ్ షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఆఫీసర్స్ సైతం అవాక్కయ్యారు. తరువాత అసలు విషయం తెలుసుకున్నారు.
అకౌంట్స్ చెక్ చేసి.. సాఫ్ట్వేర్ లోపమే దీనికి కారణమని భాను ప్రకాశ్‌కు అర్థమయ్యేలా వివరించారు. వెంటనే సాఫ్ట్ వేర్ రిపేర్ చేశారు. ఆ అకౌంట్ దర్వినియోగం కాకుండా అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. అయితే ఎన్పీఏలకు సంబంధించిన అకౌంట్లపై పరిమితలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. భాను ప్రకాశ్ అకౌంట్లో కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది అని చెప్పారు.