»Ayodhya Construction Of Museum Of Temples Approved By Up Cabinet
Ayodhya: మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి యూపీ క్యాబినెట్ ఆమోదం
అయోధ్యలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి ఆమోదించారు.
Ayodhya: Construction of Museum of Temples approved by UP Cabinet
Ayodhya: అయోధ్యలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి ఆమోదించారు. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టాటా సన్స్ ప్రతినిధులు ఇంతకు ముందు తమ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే కేంద్రం యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిందని తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చదిద్దనున్నారు. వీటితో పాటు టెంపుల్ సిటీ అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఒప్పుకుంది. పురాతన చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మెరుగులు దిద్దడంతోపాటు లఖ్నవూ, ప్రయాగ్రాజ్, కపిలవాస్తు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది.