»Marriage Expenses Indians Spend More On Marriage Than Education
Marriage Expenses: విద్య కంటే వివాహానికే ఎక్కువగా ఖర్చు చేస్తున్న భారతీయులు
మనదేశంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. అయితే భారతీయులు పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో జెఫెరీస్ అనే ఒక క్యాపిటల్ మార్కెట్ సంస్థ ఓ అధ్యయనం చేసింది. విద్య కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపింది.
Marriage Expenses: Indians spend more on marriage than education
Marriage Expenses: మనదేశంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. ఎవరి సంప్రదాయాలకు తగ్గట్టుగా వారికి ఉన్నదాంట్లో ఘనంగా వివాహం చేస్తుంటారు. కొందరైతే అప్పు చేసి అయిన లేదా ఆస్తులు అమ్మి అయిన పెళ్లి ఘనంగా చేస్తుంటారు. అయితే భారతీయులు పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో జెఫెరీస్ అనే ఒక క్యాపిటల్ మార్కెట్ సంస్థ ఓ అధ్యయనం చేసింది. దేశంలో పిల్లల చదువుపై పెడుతున్న ఖర్చు కంటే వివాహాలపై రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపింది. ప్రతి ఏటా భారతీయులు వివాహాలకు ఖర్చు చేసే మొత్తం కంటే అమెరికాలో చేసే ఖర్చు కంటే రెట్టింపు ఉందని నివేదిక తెలిపింది.
వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. దేశంలో సగటున ఒక్కో వివాహానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై చేసే ఖర్చు కంటే రెండింతలు ఉందని తెలిపింది. భారతీయులు సగటున వివాహానికి ఖర్చు చేస్తున్న మొత్తం మన దేశ తలసరి జీడీపీ కంటే ఐదు రెట్లు ఎక్కువ. దేశంలో సగటు కుటుంబ వార్షికాదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ అని తెలిపింది. అలాగే దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఆభరణాల్లో వివాహ ఆభరణాల వాటానే 50 శాతం ఉంటుందని, మొత్తం వస్త్రాల అమ్మకాల్లో వివాహ వస్త్రాల వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.