SRD: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం మెరుగైన విద్య అందించాలని ఎంఈవో రహీమొద్దీన్ ఉన్నారు. మంగళవారం కంగ్టి మండల దెగుల్ వాడి, రాంతీర్థీ పాఠశాలలను ఎంఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలతో పాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను, వంటశాల భోజనాన్ని పరిశీలించారు.