అన్నమయ్య: కురబలకోట మండలానికి చెందిన పాపారావు (70) యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.