MDK: అతి తక్కువ ఖర్చుతో తల్లి పురుగులను ఆకర్షించే ‘లైట్ ట్రాప్’ను తయారు చేసిన ఇన్ఛార్జ్ ఏడీఏ రాజు నారాయణను రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి బుధవారం సన్మానించారు. ఆయన ఆవిష్కరణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అభినందించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కూడా పాల్గొని రాజు నారాయణను ప్రశంసించారు.