VZM: పూసపాటిరేగ, మహారాజుపేట నుంచి టోల్గేట్ వరకు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్‌జాగ్‌గా స్టాపర్స్ ఏర్పాటు చేయాలన్నారు.