PPM: జనవరి 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పోలమాంబ జాతరకు, ఫిబ్రవరి 3న జరుగు మారు జాతరకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది జిల్లా అధికారులు, కమిటీ సభ్యులను ఆదేశించారు. బుధవారం జేసీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్ ఆర్. వైశాలితో కలిసి సమీక్ష నిర్వహించారు.