TG: తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని సూచించారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని.. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగిందని తెలిపారు.