NRPT: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ నెల 8 నుంచి 12 వరకు జరగనున్న 69 వ జాతీయస్థాయి (U-17) నెట్ బాల్ పోటీలకు కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థి హరీష్ ఎంపికయ్యాడు. నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటడంతో ఈ అవకాశం లభించిందని ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయ బృందం హరీష్‌ను అభినందించింది.