TG: గతంలో రైతుబంధు పథకం నిధులు వస్తున్న రైతులు.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆయా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు సమర్పించాలి. రైతులు దరఖాస్తు ఫారం నింపి.. దానికి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీలు జత చేసి ఇవ్వాలి.