వరంగల్ భద్రకాళి దేవాలయంలో మాడవీధుల అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రతి పైసా ఖర్చు లెక్కించమని అధికారులకు ఆదేశించారు. ఆలయానికి మరింత వన్నె తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నాయిని పై బుడదజల్లే ప్రయత్నాలు సబబుకాదన్నారు.