KRNL: తుగ్గలి మండలం రామలింగంపల్లిలో ఇవాళ ఏవో సురేష్ బాబు అధ్యక్షతన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా కంది పంటను నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన రైతుల నుంచే ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తుందని తెలిపారు. మండలంలో యూరియా కొరత లేదని, అవసరమైన వారు రైతు సేవా కేంద్రాల్లో పొందవచ్చన్నారు.