BDK: అశ్వాపురం ZPHS పాఠశాల యందు రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 సందర్భంగా రవాణా శాఖ అధికారులు ఎండీ ఫరూక్, రాజశేఖర్ రెడ్డి బుధవారం పాఠశాలను సందర్శించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన దేశంలో మోటార్ వాహనాలు విపరీతంగా పెరుగుతున్న సందర్భంగా రహదారి ప్రమాదాలు నానాటికి పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ని నియమాలు పాటించాలని సూచించారు.