PDPL: గ్రామాల్లో 100 శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలని ఎంపీడీవో పద్మజ అన్నారు. జూలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకూడదని, ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని, నర్సరీలకు మట్టి సమకూర్చే పనులు పూర్తి చేయాలని సూచించారు.