TG: రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదని ధ్వజమెత్తింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా? అని ప్రశ్నించింది. టికెట్ రేట్లు పెంచమని సంబంధిత మంత్రి కూడా ప్రకటించారని గుర్తుచేసింది.