TG: నీటి వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాము నీటి వివాదాలు కోరుకోవడం లేదని.. పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలపై కూర్చొని మాట్లాడుకుందామని తెలిపారు. కొంతమంది నీళ్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాము పొరుగురాష్ట్రాలతో వివాదం పెట్టుకునే ఉద్దేశం లేదన్నారు.