ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగోబా జాతరకు రావాలని శుక్రవారం మేస్రం వంశీయులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండ వస్తానన్నారు. జాతరకు సంబంధించి పలు ఏర్పాట్లను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేస్రం వంశీయులు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.