AP: నిజాం పాలన వల్ల తెలంగాణలో అనేక భూవివాదాలు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. బ్రిటీష్ పాలన వల్ల APలోనూ అనేక సమస్యలు వచ్చాయని తెలిపారు. కొందరు రౌడీలు ఇప్పటికీ భూకబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామసభ ఏర్పాటు చేసి అన్నీ సరిచేసుకున్నాకే పాస్బుక్లు ఇవ్వాలని చెప్పినట్లు పేర్కొన్నారు.