ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ నిర్మాతలు ఒక యూజర్ పోస్ట్ చేసిన నెగెటివ్ రివ్యూను తొలగించమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం 150 డాలర్లు (సుమారు రూ.14,000) ఆఫర్ చేశారని ఆ యూజర్ ఆరోపించాడు. దానికి సంబంధించిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను SMలో షేర్ చేస్తూ.. ‘ఏంటిది? నా రివ్యూను తొలగించడానికి డబ్బు ఆఫర్ చేస్తున్నారు. నేను దీన్ని అస్సలు డిలీట్ చేయను’ అని రాసుకొచ్చాడు.