SRCL: వేములవాడ పట్టణంలోని ఎరువుల విక్రయ కేంద్రాలను టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ మాట్లాడుతూ.. మండలంలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మండలంలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నా. రైతులకు అవసరమైన మేరకే ఎరువులను విక్రయించాలన్నారు.