TG: త్వరలోనే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది మనదేశంవాళ్లే అని ఉద్ఘాటించారు. ప్రపంచనగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు.