JGL: వెల్గటూర్ మండలం పైడిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను హెచ్ఎం తులసి అగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి, సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.