KNR: జిల్లాలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు, వడ్డెర కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.