TG: ఒక నగరం అభివృద్ధి చెందాలంటే భవనాలు కడితే సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ పరిశ్రమలు, స్కిల్డ్ ఎంప్లాయిస్ ఉండాలన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే.. హైదరాబాద్ సహకారం ఉండాలని ఉద్ఘాటించారు. అలాగే మచిలీపట్నం పోర్టు నుంచి HYDకు గ్రీన్ కారిడార్ హైవే రావాలంటే ఏపీ సహకారం ఉండాలన్నారు. ఒకరికొకరం సాయం చేసుకుంటేనే ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు.