సంగారెడ్డి జిల్లాలో రానున్న పురపాలక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించిన పార్టీలు ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాల టికెట్ల ఖరారుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై తమ పార్టీ జెండాలను ఎగరవేయాలనే లక్ష్యంతో గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి.