CTR: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 10న రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించినట్లు డిఇఓ రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఆరోజును ప్రత్యామ్నాయ పాఠశాల దినంగా గుర్తించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం 10న సంక్రాంతి సెలవు మంజూరు చేయడంతో పాఠశాలలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.