KDP: బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామంలోని ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 3,4,5 తరగతులను పునఃప్రారంభించాలని విద్యార్థుల కమిటీ, తల్లిదండ్రులు ఎంఈఓకు వినతిపత్రం అందించారు. ఈ సమస్యను గురువారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన డిఇఓతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తరగతులు సరిపడా గదులతో యధావిధిగా కొనసాగాలని కోరుతున్నారు.