KMM: గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి PRTU కృషి చేస్తుందని PRTU జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్. బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మధిర మండలం కృష్ణాపురం గురుకులాలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ, ఎస్సీ గురుకుల పాఠశాల టైం టేబుల్ కూడా త్వరలోనే మారే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం PRTU క్యాలెండర్ను ఆవిష్కరించారు.