TG: మేడారం జాతరకు మాజీ సీఎం KCRను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి KCR కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. మంత్రులను పసుపు, కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలతో సత్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘KCRను స్వయంగా ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని స్వీకరించారు. మేడారం జాతరకు వస్తానని అన్నారు’ అని సీతక్క తెలిపారు.