NZB: బోధన్ తట్టికోట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లలితకుమారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. గురువారం పాఠశాలలో ఆమెను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఆమె అందిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ, సామాజిక కార్యకర్త సనా పటేల్ పాల్గొని ఆమెను అభినందించారు.